![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2 '. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -100 లో... శౌర్య దగ్గర నుండి కార్తిక్ బయటకు వస్తాడు. ఏమైంది బాబు.. శౌర్య బూచోడని అంటుందని దీప అడుగుతుంది. శౌర్య నాకోసం వెతుకుంటూ వెళ్తుంటే.. ఆ నర్సింహా శౌర్యని తీసుకొని పోవాలని అనుకున్నాడంట.. ఇంతలో కడియంకి శౌర్య ఎదరుపడడంతో నాకు ఫోన్ చేసి చెప్పాడని కార్తీక్ అంటాడు.
నేనే శౌర్యకి దగ్గర అయ్యాను అనుకున్నాను కానీ తను కూడా నాకు దగ్గర అయిందని, ఆ గోడ మీద నా పేరు చూసాక అర్థం అయిందని కార్తీక్ అంటాడు. మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు. మిమ్మల్ని గుడిలో అత్తయ్య రమ్మని చెప్తే రాను అన్నారంట అని కార్తీక్ అడుగుతాడు. అదంతా జ్యోత్స్న దూరంగా ఉండి చూస్తుంది.. వాళ్ళ మాటలు వినిపించడం లేదేంటని అనుకుంటుంది. మిమ్మల్ని ఇబ్బంది పెట్టను ఇక వెళ్తానని కార్తీక్ వెళ్తుంటే.. శౌర్య వచ్చి ఏంటి వెళ్లిపోతున్నావ్ ? మళ్ళీ వస్తావా అని అడుగుతుంది. నేను ఎక్కడికి వెళ్ళను.. మళ్ళీ వస్తాను వచ్చేటప్పుడు బోలెడు చాక్లెట్లు తీసుకొని వస్తానని కార్తీక్ అనగానే.. మళ్ళీ వస్తానని మాటివ్వమని శౌర్య అంటుంది. దాంతో శౌర్యకి మాటిస్తాడు కార్తిక్.
ఆ తర్వాత జ్యోత్స్న కన్పించడం లేదేంటి ఇద్దరు కలిసి ఎక్కడికైనా వెళ్లి ఉంటారా అని పారిజాతం అనుకుంటుంది. అప్పుడే సుమిత్ర వస్తుంది. వీళ్ళు ఎక్కడ అని సుమిత్ర అడుగుగా.. సరదాగా బయటకు వెళ్లి ఉంటారని పారిజాతం అంటుంది. ఆ తర్వాత ఒకవేళ వాళ్లకి పెళ్లి అయిన జ్యోత్స్న ఎప్పుడు ఇక్కడే ఉంటుంది. అక్కడ ఇక్కడ వాళ్లే కదా అని సుమిత్ర అంటుంది. అది నా కొడుకు దాసు కూతురు.. నా మనవరాలు.. అన్నిటికి తనే వారసురాలు.. మీ ఒకొక్కరి సంగతి తర్వాత చెప్తా అని పారిజాతం అనుకుంటుంది. మరొకవైపు కార్తీక్ కి జ్యోత్స్న ఎదరుపడి.. దీప ఎక్కడ ఉందో తెలుసా అని అడుగుతుంది. లేదని కార్తీక్ అని అక్కడ నుండి వెళ్లిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |